వర్మకి ట్రాఫిక్ పోలీసులు 1300 రూపాయల జరిమానా ..

వర్మకి ట్రాఫిక్ పోలీసులు 1300 రూపాయల జరిమానా ..
x
Highlights

వర్మ ఈయనొక వెరైటీ మనిషి.. ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ ఈయన ఉంటాడు .. నిజానికి వర్మ అంటేనే వివాదం .. వివాదం అంటేనే వర్మ అనే రేంజ్ కి వెళ్ళిపోయాడు ....

వర్మ ఈయనొక వెరైటీ మనిషి.. ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ ఈయన ఉంటాడు .. నిజానికి వర్మ అంటేనే వివాదం .. వివాదం అంటేనే వర్మ అనే రేంజ్ కి వెళ్ళిపోయాడు . తాజాగా మరో వివాదం క్రియేట్ చేసాడు వర్మ .. తన శిష్యుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాని రెండో సారి చూసేందుకు వర్మ నిన్న బైక్ పై ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి మరియు అగస్త్య లతో కలిసి ట్రిపుల్ రైడ్ లో బైక్ పై విత్ అవుట్ హెల్మెట్ తో వెళ్ళాడు . అలా వెళ్ళడమే కాకుండా పోలీసులు ఎక్కడండి ? అందరు సినిమా హాల్ లోపల సినిమా చూస్తున్నారు అనుకుంటూ పోస్ట్ చేసాడు వర్మ ..

అయితే దీనిపైన పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు . బైక్ నెంబర్ ఆధారంగా హెల్మెట్ లేనందుకు మరియు ట్రిపుల్ రైడ్ లో వెళ్ళినందుకు గాను మొత్తం 1300 రూపాయల జరిమానాను విధించారు . ట్రాఫిక్ నిభందనలను ఉల్లఘించడాన్ని మా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు వర్మ .. ఇలాంటి డ్రామా , సర్కస్ లు ధియేటర్ లోనే ఎందుకు ప్రతి నిమిషం రోడ్ల పైన పోలీసులు చూస్తూనే ఉంటారని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేసారు .

అయతే వర్మ దీనిని ఇంతటితో క్లోజ్ చేయకుండా దీనిని మరింత పొడిగిస్తూ రెచ్చిపోయాడు .. సైబరాబాద్ పొలిసు ఐ లవ్ యు .. మీరు చేస్తున్న పనికి 39 రోజుల పాటు ఆగకుండా ముద్దులు పెట్టాలని ఉంది . నాకు రెండో అమ్మాయి ఉంటే మీరు నా అల్లుడు కావాలని రిక్వెస్ట్ పెట్టేవాడిని అని వర్మ రీట్వీట్ చేసాడు ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories