NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

NTR RRR
x
NTR RRR
Highlights

ఇది ఎన్టీఆర్ అభిమనులకి శుభవార్తే అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR (వర్కింగ్ టైటిల్ ) సినిమాలో ఎన్టీఆర్...

ఇది ఎన్టీఆర్ అభిమనులకి శుభవార్తే అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR (వర్కింగ్ టైటిల్ ) సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటి అలియభట్ నటిస్తుంది.

ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఎడ్గారీ జోన్స్ ని అనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరిని తీసుకున్నారు అన్నది మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. అయితే ఈ సస్పెన్స్ కి చిత్ర యూనిట్ రేపు శుభం కార్డు వేయనుంది. ఎన్టీఆర్ పక్కన నటించబోయే హీరోయిన్ గురించి మరియు సినిమాలోని ప్రతినాయకుల పాత్రల గురించి రేపు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది..

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories