Latest Tollywood Wedding: టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది

Latest Tollywood Wedding: టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది
x
Highlights

టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బ్యాచులర్ స్టార్స్ పెళ్లిపీఠలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు ఎంగేజ్ మెంట్ చేసుకొని...

టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బ్యాచులర్ స్టార్స్ పెళ్లిపీఠలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు ఎంగేజ్ మెంట్ చేసుకొని మూహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అన్నీ కలిసి వస్తే రేపోమాపో వెడ్డంగ్ కార్డ్స్ కూడా పంచేస్తారు. తాజాగా మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా వరుడుని సెలెక్ట్ చేసుకుంది. ఇన్నాళ్లు ఊరించి ఎట్టకేలకు తన హబ్బీ ఫోటోను రివిల్ చేసి, పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది.

టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది. ముగ్గురు స్టార్స్ కి పెళ్లికళ వచ్చేసింది. ప్రస్తుతం మెగా ప్రిన్సెస్ నీహారిక పెళ్లి టాలీవుడ్ ట్రెండీ టాపిక్. మెగా అల్లుడి ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు శభాష్ నిహారిక.. సెలక్షన్ సూపర్ అంటూ కితాబు ఇస్తున్నారు. అందగాడు ఆరడుగుల ఆజానుభాహుడు అంతకుమించి పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఎంతో స్టైలిష్ గా ఉన్నాడంటూ మెగా ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇక చైతన్య ఒడ్డు పొడుగు లుక్ చూస్తుంటే మెగా ఫ్యామిలీలో మరో హీరో జాయినయినట్టేనని అర్థమవుతోంది.

మెగా డాటర్ నిహారిక పెళ్లి మేటర్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక వివాహం చేసుకోబోతోంది. వెంకట చైతన్య ISB, బిట్స్ పిలానీలో చదివారు. ఓ ప్రము‌ఖ MNC కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇది పూర్తిగా పెద్దలు నిర్ణయించిన పెళ్లని చెబుతున్నారు.

నిహారిక కొన్నాళ్లు తోబుచులాడుతూ తన పెళ్లి మ్యాటర్ ను రివిల్ చేస్తూ వచ్చింది. ఒక కప్పుపై మిస్ నిహారిక అని పేరును కొట్టేసి, మిసెస్ అని రాసీ కొశ్చన్ మార్క్ పెట్టింది. అంతే కాదు ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫొటోను కూడా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. పీక్‌ ఏ బూ అని కామెంట్ చేస్తూ అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు నిహారిక. ఆ పోస్ట్‌ చేసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పారు. మరికొందరు ఫేస్‌ చూపించాలని కోరారు.

అయితే తాజాగా నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అంటూ గురువారం సాయంత్రం ఓ ఫొటో బయటకు వచ్చింది. అంతేకాకుండా నిహారిక అధికారికంగా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

నిహారిక పెద్దలు కూదిర్చిన పెళ్లి చేసుకోబోతుంటే ఇద్దరు బ్యాచ్ లర్ హీరోలు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. తమ లవర్స్ ని ఒప్పించి, ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. లాక్ డౌన్ అడ్డు రాకుంటే హానీమూన్ డే స్ కూడా ఫినిష్ చేసేవారేమో కానీ ఇప్పుడు మూహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు.

దగ్గుబాటి ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగనున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రానా కూడా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతీ తెలిసిందే ముంబైకి చెందిన మిహికా బజాజ్ తో పర్మినెంట్ జోడి కట్టనున్నాడు.

మిహికా బజాజ్ ఓ డిజైనర్.. హైదరాబాద్ లో ఓ డిజైనర్ స్టూడియోను ఓపెన్ చేసి రన్ చేస్తోంది. రానా ఎప్పుడు చూశాడో ఎక్కడ చూశాడో కానీ మిహికారగ పడిపోయాడు. ఆమెకు ప్రొపోజు చేసి, చివరకు ఒప్పించాడు. ఇంకేముంది. పెద్దల సమక్షంలో వైభవంగా ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఆగ‌స్టు 8న హైద‌రాబాద్‌లో పెళ్లి జరగనుంది.

టాలీవుడ్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న మరో యంగ్ స్టార్ నితిన్. బ్యాచ్ లర్ లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టేందుకు నితిన్ కూడా రెడీ అవుతున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన షాలినీని తన లైఫ్ పాట్నర్ ను చేసుకోబోతున్నాడు. హీరో నితిన్ నాలుగేళ్లుగా ఆమెతో లవ్ లో ఉన్నాడట. కానీ గాసిప్ రాయుళ్ల కంటపడకుండా జాగ్రత్తపడ్డాడు.

నితిన్ పెళ్లి చేసుకోబోయే షాలినీ సొంతూరు ప్రకాశం జిల్లా. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో డాక్టర్స్ గా సెటిలయ్యారు. స్కూల్ స్టడీస్ అన్నీ షాలిని హైదరాబాద్ లోనే పూర్తి చేసుకుంది. కానీ హైయర్ స్డడీస్ కోసం లండన్ కు వెళ్ళి ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఎంఎన్ సీ కంపెనీ లో హెచ్ ఆర్ గా పనిచేస్తోంది. వీరిద్దరు కూడా మూహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది. దగ్గుబాటి సురేష్, మెగా బ్రదర్ నాగబాబు, సుధాకర్ రెడ్డి తమ వారసుల పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories