మహేష్ బాబు కోటిరూపాయల విరాళం

మహేష్ బాబు కోటిరూపాయల విరాళం
x
Mahesh Babu (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వానికి సహాయ పడుతూ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలను, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. హీరో ప్రభాస్ కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలను అందజేశారు.

ఇక తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించారు. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చ‌క్కటి ప్రయ‌త్నాల్ని చేస్తున్నాయ‌ని, ఈ పోరాటంలో త‌న వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌తో పాటు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధిల‌కు కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్నట్లు మ‌హ‌ష్‌బాబు వెల్లడించారు.ఇక దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరుతున్నట్లుగా మహేష్ వెల్లడించారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories