తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించిన సరిలేరు నీకేవ్వరు

తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించిన సరిలేరు నీకేవ్వరు
x
Sarileru Neekevvaru (File Photo)
Highlights

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకటి..

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.. మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం, 13 ఏళ్ల తరవాత లేడి అమితాబ్ రీఎంట్రీ ఇవ్వడంతో సినిమాపైన అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో సినిమాకి మొదటిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక సినిమాకి ముందు దేవీ అందించిన పాటలకి ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది.

ఇక సినిమా విడుదలయ్యాక 30 రోజులకి అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. చాలా మంది సినిమాని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించారు. అయినప్పటికీ సినిమాకి రెస్పాన్స్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఉగాది సందర్భంగా మార్చి 25న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జెమిని టీవీ ప్రసారం చేసింది. ఎవ్వరు ఉహించని టీవీఆర్‌ను సంపాదించుకొని రికార్డు సృష్టించింది. 'బాహుబలి 2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు 22.7 టీవీఆర్ ని బ్రేక్ చేస్తూ 23.4 టీవీఆర్‌ను సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యధిక టీవీఆర్ కావడం విశేషం.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ సినిమాని మహేష్ పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి. కథలో చిన్న చిన్న మార్పులు చేయాలనీ మహేష్ వంశీని కోరారని టాక్ నడుస్తోంది. అయితే తన 27 వ సినిమాని మహేష్ పరుశురాంతో చేస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories