Top
logo

ఆమె వల్లే నా సక్సెస్ అంటున్న రోజా.. అత్త అన్నపూర్ణను గుర్తుచేస్తూ అమల!!

ఆమె వల్లే నా సక్సెస్ అంటున్న రోజా.. అత్త అన్నపూర్ణను గుర్తుచేస్తూ అమల!!Akkineni Amala, Roja (File Photo)
Highlights

ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అమ్మతో జ్ఞాపకాలను, తీపి గుర్తులను...

ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అమ్మతో జ్ఞాపకాలను, తీపి గుర్తులను అభిమానులతో పంచుకుంటూ 'మదర్స్ డే' విషెస్ చెబుతున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు మదర్స్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు. తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. అందులో తన తల్లి ఫొటోతో పాటు అత్తగారు అన్నపూర్ణమ్మ గారి ఫోటోలను షేర్ చేశారు.

అన్నపూర్ణ తనకు తల్లి కంటే ఎక్కువ అని. ''ఐ మిస్ యూ అత్తమ్మా" అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. తల్లి గురించి చెబుతూ "మై బ్యూటిఫుల్ మామ్" అంటూ ట్వీట్ చేశారు అమల.. వీరితో పాటు తన సోదరి, మేనకోడలు ఫోటోలను సైతం పోస్ట్ చేశారు అమల..

ఇక సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా తన అమ్మను గుర్తు చేసుకుంటూ.." అమ్మ అంటే అందరికీ ప్రాణం. అమ్మ అనే పదమే అద్భుతం. మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహం వల్లే సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో, ఓ తల్లిగా ఇంట్లో నేను సక్సెస్‌ అయ్యాను. మా అమ్మను చాలా మిస్‌ అవుతున్నాను. తల్లులందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు అని రోజా పేర్కొన్నారు.


Web TitleTollywood senior actress Roja and akkineni amala Special tweets on Mothers Day
Next Story