Top
logo

ప్రధానమంత్రి సహాయనిధికి నటుడు కృష్ణంరాజు కుమార్తెల విరాళం!

ప్రధానమంత్రి సహాయనిధికి నటుడు కృష్ణంరాజు కుమార్తెల విరాళం!Krishnam Raju and Family (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరో, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు తమవంతుగా ఆర్ధిక సహాయం ప్రకటించారు.. తాజాగా మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి కూడా తమ వంత సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి నాలుగు లక్షల రూపాయలు, ముగ్గురు కుమార్తెలు ఒక్కొక్కరూ రెండు లక్షల రూపాయలు మొత్తం రూ.10 లక్షలు ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఇక ఇంతకుముందే యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకి చెరో యాబై లక్షలు ప్రకటించారు. అంతేకాకుండా సినీ కార్మికులకోసం ఏర్పాటు చేసిన సీసీసీ కి యాబై లక్షలను ప్రకటించారు.

Web TitleTollywood Senior Actor Rebel star Krishnam Raju Daughters has donated 10 Lakh Rupees to PM Crisis
Next Story