దాసరి నాకు తండ్రి లాంటి వారు.. మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్..

దాసరి నాకు తండ్రి లాంటి వారు.. మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్..
x
Mohan Babu (File Photo)
Highlights

దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు దాసరి నారాయణరావు..

దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు దాసరి నారాయణరావు.. తాత మనవడు సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణంలో 150 చిత్రాలకి పైగా దర్శకత్వం వహించారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించారు దాసరి.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈరోజు (సోమవారం) ఆయన జయంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే మంచు మోహన్ బాబు ఆయనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

"నా తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం. నటుడిగా నాకు జన్మ ప్రసాదించిన గురువుగారు దాసరి నారాయణ రావు గారు, మోహన్ బాబు అని నామకరణం చేశారు1975. నన్ను ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా అన్ని రకాల పాత్రలు నాకిచ్చి...నన్ను ఇంతటి వ్యక్తిని చేసిన ఆ మహనీయుడు, తండ్రి లాంటి తండ్రి దాసరి నారాయణరావు గారి పుట్టిన రోజు మే 4న అంటే ఈరోజు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, గురువుగారి ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటాయని నేను కోరుకుంటున్నాను" అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories