రాజమౌళి మైనస్ పాయింట్ ఇదే.. బయటపెట్టిన కీరవాణి

రాజమౌళి మైనస్ పాయింట్ ఇదే.. బయటపెట్టిన కీరవాణి
x
MM Keeravani, SS Rajamouli (File Photo)
Highlights

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే.. అపజయం ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు రాజమౌళి.

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే.. అపజయం ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు రాజమౌళి.. ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పలు దేశాలకి చాటాడు. అయితే అయన గురించి ప్రముఖ సంగీత దర్శకుడు, రాజమౌళి అన్నయ్య అయిన కీరవాణి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న ఆయన ప్రముఖ మీడియా సంస్థకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళిలో నచ్చిన, నచ్చని పాయింట్స్ ని చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే రాజమౌళి ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తుంటారని, కాస్త మెచ్చుర్డ్ సినిమాలు చూడమని చెప్పినా వినకుండా అదే కంటిన్యూ చేస్తారని చెప్పుకొచ్చారు అమెరికన్ కామెడీ డ్రామా 'ఫారెస్ట్ గంప్' సినిమా చూడమని ఇంతవరకు చూడలేదని వెల్లడించారు. ఇక రాజమౌళిలో గొప్ప విషయం ఏంటంటే.. ఏదైనా అనుకుంటే దానిని సాధించేవరకు వదలరు అని కీరవాణి వెల్లడించారు.

ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ సినిమాలో పాటలు, నేపధ్య సంగీతం చాలా గొప్పగా ఉంటుందని కీరవాణి చెప్పుకొచ్చాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories