తమన్ కి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పవన్

తమన్ కి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పవన్
x
Pawan Kalyan and Thaman (File Photo)
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయినకున్నా ఫాలోయింగ్ చూస్తే షేక్ అవ్వాల్సిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయినకున్నా ఫాలోయింగ్ చూస్తే షేక్ అవ్వాల్సిందే.. ఇక ఆయనని ట్విట్టర్ 3.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయన సినిమాకి సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చిన సరే క్షణాల్లో వైరల్ అయిపోయి ట్రెండ్ అవ్వాల్సిందే.. ఇక అయన మాత్రం ట్విట్టర్ లో కేవలం 34 మందిని అనుసరిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నారు. మోదీ, అమిత్‌షా, కేటీఆర్‌, అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఉన్నారు.

ఇక తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ కూడా చేరిపోయాడు. ట్విటర్‌లో పవన్ తమన్ ని ఫాలో అవుతున్న విషయాన్ని నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకున్న తమన్ ఆనందంతో పులకరించిపోయాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'ఇది నాకు అతి పెద్ద ఫ్యాన్‌ మూమెంట్‌. నా రోజును ఆనందంగా ప్రారంభించడానికి ఇంత కంటే మంచి కారణం ఏం కావాలి. వపన్‌ సర్‌ మీపై నాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. లవ్‌ యూ సర్‌' అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మగువా మగువా అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాని మేలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories