టాలీవుడ్ వివాదానికి ముగింపు పలకబోతున్నారా.. అసలు 9తేదీన ఏం జరగబోతుంది?

టాలీవుడ్ వివాదానికి ముగింపు పలకబోతున్నారా.. అసలు 9తేదీన ఏం జరగబోతుంది?
x
Balakrishna, Chiranjeevi, YS Jagan (File Photo)
Highlights

టాలీవుడ్ వివాదానికి ముగింపు పలకబోతున్నారా?? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య భేటీపై క్లారిటీ వచ్చింది.

టాలీవుడ్ వివాదానికి ముగింపు పలకబోతున్నారా?? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య భేటీపై క్లారిటీ వచ్చింది. చిరంజీవి.. బాలయ్యను ఈ భేటీకి వస్తున్నారా... అసలు 9తేదీన ఏం జరగబోతుంది?

కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత 70 రోజులుగా షూటింగ్‌లతో సహా అన్ని పనులు నిలిచిపోయాయి. థియేటర్స్ మూత పడ్డాయి. విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్స్ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు.. వేలాది మంది సినీ కార్మికులు పనిలేక, పూట గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో చలన చిత్రం రంగం పడుతున్న ఇబ్బందుల్ని తెలుగు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకుని వెళ్లారు ఇండస్ట్రీ పెద్దలు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాటు మంత్రి తలసానిని కలిసిన సినీ పెద్దలు... ఇప్పుడు ఈనెల 9న ఏపీ సిఎం జగన్‌ను కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఒక కార్యచరణతో రమ్మని టాలీవుడ్‌కి జగన్‌ ఆహ్వానం పంపారు. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి అధ్యక్షతన కొంతమంది పెద్దలు జగన్‌ను కలవనున్నారు.

ఈ మీటింగ్‌కు మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నందమూరి బాలకృఫ్ణను కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. గతంలో ఏర్పడిన వివాదాలు పునరారావృతం కాకుండా ఉండేలా చిత్ర ప్రముఖులతో పాటు బాలయ్యను పిలవాలనే నిర్ణయించుకున్నాయి. ఈనెల 9న జరగబోయే జగన్-చిరు భేటీకి నందమూరి బాలకృష్ణ హాజరుకావడం లేదని స్పష్టం చేశారు నిర్మాత సి కల్యాణ్‌. పుట్టిన రోజు వేడుకల వల్ల బాలయ్య హాజరు కాలేకపోతున్నారని... ఇండస్ట్రీలో ఎలాంటి గ్రూపులు లేవని అందరం కలిసే ఉంటున్నామని చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతోన్న పెద్దల్లో విభేదాలు ఉన్నాయంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలు, కథనాలు, అనుమానాలపై కల్యాణ్‌ మాటలతో క్లారిటీ వచ్చింది. షూటింగులకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఙతలను తెలుపుకోవడానికి టాలీవుడ్ పెద్దలు జగన్‌ను కలుసుకోబోతున్నారనేది ఫిల్మ్‌నగర్ టాక్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories