ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..

ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..
x
Rajamouli, Jr.NTR (File Photo)
Highlights

ఎన్టీఆర్, రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్టీఆర్, రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో హైట్రిక్ ని అందుకుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

స్టూడెంట్ నెం1 సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ వయసు 19 సంవత్సరాలు.ఇంకా మీసాలు కూడా రాలేదు. లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైల్ బాగుండేది కాదు. కనీసం పర్సనల్ గ్రూమింగ్ కూడా అతినికి తెలియదు. సో.. నా తొలి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంటి అని చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా తారక్ చెబుతున్న డైలాగ్స్, యాక్టింగ్ చూసి షాక్ అయ్యాను. ఎన్టీఆర్ లో ఏదో ప్రత్యేకత ఉందని, ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోయిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికి వచ్చేసరికి పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories