కరోనా క్రైసెస్ చారిటీకి విరాళం ప్రకటించిన రాజమౌళి

కరోనా క్రైసెస్ చారిటీకి విరాళం ప్రకటించిన రాజమౌళి
x
SS Rajamouli (File Photo)
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగలపైనా పండింది.. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి..

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగలపైనా పండింది.. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి.. దీనితో రోజు వారీ వేతనాలు చేసుకునే సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు తెలుగు ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛారిటీ కి తమ వంతు సాయంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. ఈ సంస్థ ద్వారా సినీ కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

తాజాగా ఈ ఛారిటీ కి త‌న వంతు సాయం చేసేందుకు రాజ‌మౌళి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఆర్థిక సాయం అందించాడు. తన నిర్మాత డివివి దానయ్యతో కలిసి సినిమా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన CCCకి 10 లక్షల విరాళం ప్రకటించాడు ఈ టాలీవుడ్ దర్శకధీరుడు అంతకుముందు రాజమౌళి భారీగా మాస్కుల‌తో పాటు ప్రొటెక్ట‌ర్స్ ను అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories