ఆ పాత్ర కోసం అడిగితే పదిలో తొమ్మిది మంది అతని పేరే చెప్పారు : రాజమౌళి

ఆ పాత్ర కోసం అడిగితే పదిలో తొమ్మిది మంది అతని పేరే చెప్పారు : రాజమౌళి
x
Rajamouli, Jr.NTR, Ram Charan, Ajay Devgan (File Photo)
Highlights

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

తాజాగా ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్ వీడియో ప‌లు భాష‌ల‌లో విడుద‌లై ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాకి అజయ్ దేవగన్ ని తీసుకోవడానికి గల కారణం గురించి రాజమౌళి తాజాగా ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ సినిమా కంటే ముందు ఈగ సినిమాను హిందీలో విడుదల చేయాలని జక్కన్న అనుకున్నప్పుడు అజయ్‌, కాజోల్‌ను కలిశారు. హిందీ వెర్షన్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు ఇద్దరు వెంటనే ఒప్పుకొన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ కోసం కలిసి పని చేస్తున్నారు. సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకొచ్చారు.. అయితే ఈ పాత్ర కోసం ఉండాల్సిన లక్షణాలు, నాకు ఉన్న అవసరాలు కొంత మందికి చెప్పి, సలహా అడిగిన క్రమంలో పదిలో తొమ్మిది మంది అజయ్‌ దేవగణ్‌ పేరు చెప్పారు. పాత్ర చెప్పగానే దానికి ఆయన ఒప్పుకోవడం సంతోషం అని అన్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories