సల్మాన్ ఖాన్ తో పూరి సినిమా?

సల్మాన్ ఖాన్ తో పూరి సినిమా?
x
Puri Jagannadh, Salman Khan (File Photo)
Highlights

గత ఏడాది స్మార్ట్ శంకర్ సినిమా తో భారీ హిట్ కొట్టాడు. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..

గత ఏడాది స్మార్ట్ శంకర్ సినిమా తో భారీ హిట్ కొట్టాడు. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్.. ఈ సినిమాని కరొన్ జోహార్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ముంబైలో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. బాక్సింగ్ నేపద్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాని తెరకెక్కించడం పూరి స్టైల్ అని తెలిసిందే కదా.. అందులో భాగంగానే పూరి మరో సినిమాకి కమిట్ అయ్యాడు అని తెలుస్తోంది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో పూరి ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. సల్మాన్‌ కోసం పూరి తన స్టయిల్లో ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారని ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సల్మాన్‌తో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఇక ఇప్పటికే పూరి హిందీలో అమితాబ్ బచ్చన్ తో 'బుడ్డా హోగా తేరా బాప్‌' సినిమాను హిందీలో తీశారు . ఇక సల్మాన్ ఖాన్ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాని హిందీలో వాంటెడ్ సినిమాగా రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా సల్మాన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. దీనితో మళ్లీ వీరిద్దరి మధ్య కంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories