'సైరా' గురించి సెలబ్రిటీలు ఏమన్నారంటే... !

సైరా గురించి సెలబ్రిటీలు ఏమన్నారంటే... !
x
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా చిరంజీవి సైరా సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో సినిమాని తెరకేక్కించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ...

ఎంతో ప్రతిష్టాత్మకంగా చిరంజీవి సైరా సినిమా తెరకెక్కింది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో సినిమాని తెరకేక్కించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి షో నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమాకి ప్రేక్షుకులు మాత్రమే కాదు సినిమా సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. సినిమా గురించి ఎవరెవరు ఎం ఎం అన్నారంటే... !

సైరాలో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పాత్రలో చిరంజీవి గారి నటన అద్భుతం,అమోఘం.. చరిత్ర మరిచిన వీరుడి కథను తన అద్భుతమైన నటనతో మళ్ళీ గుర్తు చేసారు. రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి అభినందనలు : రాజమౌళి

విజువల్ పరంగా సైరా సినిమా చాలా బాగుంది. రిచ్ గా సినిమాని ఆవిష్కరించారు. సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ చిత్రబృందానికి అభినందనలు.. సినిమాలో రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది.రీసెంట్ టైంలో చూసిన ది బెస్ట్ ఇదే : మహేష్ బాబు

స్వాతంత్ర సమరయోధుడి కథను అద్భుతంగా తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి కంగ్రాట్స్, సినిమాని చాలా అద్భుతంగా, అంకితభావంతో తెరకెక్కించిన రామ్ చరణ్ కి అభినందనలు.. నయనతార,తమన్నా నటన బాగుంది : శ్రీను వైట్ల

పదునాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగా స్టార్ కి, ఆయన కడుపున పుట్టిన పులి బిడ్డ రామ్ చరణ్ కి, వందనం ! అభివందనం ! నిద్ర లేని రాత్రులు గడిపి, ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకుడైన సురేంద్ర రెడ్డి కి, సాంకేతిక నిపుణలకు, నటీ నటులకు నమో నమః జై చిరంజీవా జైజై సైరా... : పరుచూరి గోపాలకృష్ణ

'ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్‌ : హరీష్ శంకర్

సైరాలో మెగాస్టార్ ఫెర్ఫార్మెన్స్ లెజెండరీగా నిలిచింది. సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర పై చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎంత రిచ్‌గా ఉందో నిర్మాతగా రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతే రిచ్‌గా ఉన్నాయి : సుధీర్ బాబు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories