సమంత బర్త్ డే స్పెషల్ : స్వయంకృషితో స్టార్ హీరోయిన్ అయిన అక్కినేని వారి కోడలు

సమంత బర్త్ డే స్పెషల్ : స్వయంకృషితో స్టార్ హీరోయిన్ అయిన అక్కినేని వారి కోడలు
x
Samantha (File Photo)
Highlights

2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నటి సమంత..

2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నటి సమంత.. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత సినిమా రంగం వైపు అడుగులు వేసింది. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదిగింది. మొదటి సినిమాతోనే ఇటు అందం అటు అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేలా చేసింది ఈ చెన్నై భామ.. ఇక ఆ తరవాత ఎన్టీఆర్ సరసన బృందావనం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో నటించిన మళ్ళీ వెనుదిరిగి చూసుకుంది లేదు.

ఈ సినిమా తరవాత స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. అందులో ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలలో నటించి అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక 2013లో రేవతి తర్వాత ఒకేసారి ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా సమంత ప్రసిద్ధి గాంచింది.

ఇక తన మొదటి చిత్ర కథానాయకుడు అయిన అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్ళాడింది సమంత.. వీరికి 2017లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. సాధారణంగా అయితే సినిమాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో హీరోయిన్స్ పెళ్లి వైపు అడుగుపెడతారు కానీ సమంత మాత్రం స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళయిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది.

పెళ్లి అనంతరం 'రంగస్థలం' 'మహానటి' 'అభిమన్యుడు' 'మజిలీ' 'సూపర్ డీలక్స్' ' ఓ బేబీ', 'జాను' లాంటి కథాప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది సమంత.. ప్రస్తుతం సమంత ఇటు తెలుగు, అటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే సమంత ఈ రోజు తన 33వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఇలాగే సమంత మరిన్ని సినిమాలలో నటించి మరిన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది హెచ్ఎంటీవీ!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories