లిక్కర్ వీడియో పై రకుల్ సెటైర్!

లిక్కర్ వీడియో పై రకుల్ సెటైర్!
x
Rakul preet singh(File hoto)
Highlights

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా మద్యంషాపులకు అనుమతి ఇచ్చింది.

కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ ని మే19 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా మద్యంషాపులకు అనుమతి ఇచ్చింది. దీనితో ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో మద్యం షాపులు గత సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ధరలు పెంచినప్పటికి మందుబాబులు మాత్రం దుకాణాలు వద్ద భారీ క్యూలు కడుతున్నారు. ఎండలను సైతం లెక్క చేయడం లేదు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ మెడికల్ షాపు నుంచి బయటకు వస్తూ చిన్న‌ చిన్న బాటిల్స్‌తో కనిపించింది. దీనితో రకుల్ పై మ‌ద్యం షాపు నుంచి మ‌ద్యం కొనుగోలు చేసి వెళుతోందంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపైన రకుల్ స్పందించింది. ఓ.. వావ్ మెడిక‌ల్ షాపుల్లోనూ మ‌ద్యం అమ్ముతార‌ని నాకు తెలియదు అంటూ సేటరికల్ గా స్పందించింది.

ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన రకుల్ కి ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవు.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియాన్2 చిత్రంలో రకుల్ నటిస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories