పెళ్లి కూతురు అయిన పూజా హెగ్డే!

పెళ్లి కూతురు అయిన పూజా హెగ్డే!
x
Pooja Hegde (file Photo)
Highlights

హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి కూతురు అయింది. చేతికి మెహందీ పెట్టుకుని, బంగారు వ‌ర్ణ‌పు దుస్తుల్లో ముస్తాబైంది.. అయితే ఇక్కడం నిజంగా పెళ్లి కూతురుగా...

హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి కూతురు అయింది. చేతికి మెహందీ పెట్టుకుని, బంగారు వ‌ర్ణ‌పు దుస్తుల్లో ముస్తాబైంది.. అయితే ఇక్కడం నిజంగా పెళ్లి కూతురుగా మాత్రం కాదండోయ్.. సినిమాల్లో భాగమే.. ప్రస్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ లను పక్కన పెట్టి సెలబ్రిటీలు తమ తమ ఇంట్లో ఉంటూ సరదాగా గడుపుతున్న సంగతి తెలిసిందే కదా! అందులో భాగంగానే తాజాగా పూజా హెగ్డే సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

హౌస్ ఫుల్‌-4 సినిమాకు సంబంధించిన రెండు స్టిల్స్‌ ని రిలీజ్ చేస్తూ.. సంగీత్ డ్రెస్‌లో ఇలా... అని ఆమె క్యాప్ష‌న్ పెట్టింది. పూజా అందులో పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఉన్న ఒక ఫోటోను మనం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పూజా సూపర్బ్, క్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories