payal rajput: గ్లామర్ లోనే కాదు.. సేవలోనూ అదుర్స్!

payal rajput: గ్లామర్ లోనే కాదు.. సేవలోనూ అదుర్స్!
x
Payal Rajput (file photo)
Highlights

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్.. చేసిన మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటి.. ఆ సినిమా...

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్.. చేసిన మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటి.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాయల్ కి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక రొమాన్స్ ప్రధానంగా కలిగిన సినిమాల్లోనే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆర్డీఎక్స్ 100 లవ్ అనే సినిమాని చేసింది పాయల్. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రొమాన్స్ ని పక్కన పెట్టి 'వెంకీమామ' సినిమా చేసింది పాయల్.. ఈ సినిమా ఆమెకి విజయాన్నిచ్చింది. హిందీ టీచర్ పాత్రలో ఆమె నటనకి గాను మంచి మార్కులే పడ్డాయి. వెంకీమామ మంచి సక్సెస్ కావడంతో నటనకి ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న 'డిస్కోరాజా' సినిమాలో సినిమాలో నటించింది. అయితే పాయల్ కి గ్లామర్ తో ప్రేక్షకులను అక్కట్టుకోవడమే కాదు.. తనలో ఇంకో కోణం కూడా ఉంది. తాజాగా ఈ భామ ఓ గోశాలలో ఆవులకు గ్రాసం పెడుతున్న వీడియోను తన ఇస్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది.. అంతేకాదు.. వీలు దొరకినపుడల్లా గోవులకు ఆహారం పెడితే తనకు సంతృప్తి ఉంటుందని చెప్పుకొచ్చింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories