బికినీకి నో చెప్పిన కీర్తి సురేష్.. హిందీ సినిమాకి టాటా!

బికినీకి నో చెప్పిన కీర్తి సురేష్.. హిందీ సినిమాకి టాటా!
x
Highlights

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది..

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తికి హిందీలో ఒక చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. అయితే దిని వెనుక కారణం లేకపోలేదు..ఈ చిత్రంలో భాగంగా కీర్తిని బికినీ ధరించమని అడిగారట మేకర్స్.. కానీ అందుకు నో చెప్పిన కీర్తి సదరు చిత్రం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం.. కీర్తి మొదటి నుంచి స్కిన్ షో చేయడానికి ఆసక్తి చూపలేదు.. కథకి, పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది.

ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది.. తెలుగులో హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ నీ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాతో పాటు మిస్ ఇండియా అనే తెలుగు చిత్రంలో కీర్తి నటిస్తుంది. ఇక త‌మిళంలో అన్నాత్తి, పెంగ్విన్ చిత్రాల‌లో న‌టిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories