నెటిజన్లకు అడ్డంగా బుక్కయిన జబర్దస్త్ యాంకర్లు!

నెటిజన్లకు అడ్డంగా బుక్కయిన జబర్దస్త్ యాంకర్లు!
x
Anasuya and Rashmi (File Photo)
Highlights

సోషల్ మీడియా వచ్చాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంటే కష్టమే...తప్పుగా మాట్లాడి దొరికితే నెటిజన్ల నుంచి ట్రోలింగ్ తప్పదు.

సోషల్ మీడియా వచ్చాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంటే కష్టమే...తప్పుగా మాట్లాడి దొరికితే నెటిజన్ల నుంచి ట్రోలింగ్ తప్పదు. తాజాగా మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు జబర్దస్త్ యాంకర్లు రష్మీ, అనసూయ. ఇప్పటికే చాలాసార్లు నెటిజన్లతో ట్రోల్స్ కి గురైన ఈ భామలు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేతులకి పని చెప్పి, వాళ్ళ చేతులకి సైతం పనిచెప్పుకున్నారు.

కరోనా భయం ఉన్న ఆ రోజుల్లో యాంకర్ రష్మీ ఓ షాప్ ఓపెనింగ్ అని వెళ్ళింది. రష్మీ అక్కడికి రావడంతో జనాలు కూడా ఫుల్ గానే వచ్చారు. దీనితో కరోనా భయం ఒక పక్క నడుస్తుంటే ఈ ప్రమోషన్ కార్యక్రమాలు ఏంటి అని నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అది పాత అపాయింట్ మెంట్ అని, అసలు జనాలెందుకు అంతమంది ఎందుకు వచ్చారు, జనాలకే బుద్ధిలేదంటూ సీరియస్ అయింది. దీనికి నెటిజన్లు ఉరుకుంటారా మరి ! అసలు ముందు రష్మీ అక్కడి రాకుంటే అక్కడ జనాలు అంతమంది ఎందుకు వస్తారు.. ఇక్కడ విజ్ఞత ఉండాల్సింది ఎవరికి, జనాలకా,రష్మీకా అంటూ డైరెక్ట్ గానే స్పందించారు..

ఇక అనసూయ విషయానికి వచ్చేసరికి కరోనా ప్రభావం వలన మార్చి 31వ తేదీ వరకూ రాష్ట్రాన్ని లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి రూ.1500 ఆర్థికసాయం కింద అందచేయనున్నట్లు కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. దీంతో అనసూయ తన ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ.. 'సర్‌.. మీరు మరికొన్ని వృత్తులను సైతం పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు, ఈఎంఐలు, ఇలాంటివి కట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను మీరు పరిశీలించాలని కోరుకుంటున్నట్లు అనసూయ ట్వీట్ చేసింది.

అయితే దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ..'మంచి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండే మీరే ఇలా మాట్లాడితే.. సామాన్యులు ఏమైపోవాలి' అంటూ ట్రోల్స్ చేశారు. దీనితో అనసూయ సహనంతో కొన్నింటికి జవాబు ఇచ్చింది. మరికొంతమంది అకౌంట్స్ బ్లాక్ చేసింది. అయితే ఇక్కడ అనసూయ, రష్మీ ఒకే అంశంపై ట్రోల్ అవ్వడం విశేషం..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories