కరోనా క్రైసిస్ ఛారిటీకి ప్రభాస్ యాబై లక్షల విరాళం

కరోనా క్రైసిస్ ఛారిటీకి ప్రభాస్ యాబై లక్షల విరాళం
x
Young Rebel Star Prabhas (File Photo)
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలను ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌ చెరో 25 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, రవితేజ 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికే ప్రభాస్ కరోనా వైరస్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా నాలుగు కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీనితో మొత్తం నాలుగు కోట్ల యాబై లక్షల రూపాయలను ప్రభాస్ విరాళంగా ప్రకటించి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories