సెల్యూట్ పోలీస్ .. వారి త్యాగాన్ని గౌరవిద్దాం: సాయి ధరమ్ తేజ్

సెల్యూట్ పోలీస్ .. వారి త్యాగాన్ని గౌరవిద్దాం: సాయి ధరమ్ తేజ్
x
Sai Dharam Tej( File Photo)
Highlights

కరోనా వైరస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..

కరోనా వైరస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే దీనిని కొందరు పాటిస్తుండగా, మరికొందరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి గుంపులుగుంపులుగా వస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైదులు, పోలీసులు తమ బాధ్యతలను కర్తవ్యంగా నిర్వర్తిస్తూ ఉంటే ప్రజలు ఇలా నిర్ల‌క్ష్య ధోరణి చూపించ‌డం సరైనది కాదని మండిపడుతున్నారు.

ఇక తాజాగా ఓ నెటిజ‌న్ షేర్ చేసిన ఫోటో ఒక‌టి హీరో సాయిధ‌ర‌మ్‌ తేజ్ ని ఆకట్టుకుంది. ఆ ఫోటోలో విధులు నిర్వ‌ర్తించి వ‌చ్చిన పోలీస్ స‌ప‌రేట్‌గా కూర్చొని ఒక్క‌రు తింటుంటే, ఆ ఫ్యామిలీ మొత్తం ఆయ‌న‌కి దూరంగా నిల్చొని ఉంది. అయితే దీనిపైన సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ... "మన కోసం అధికారులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడుతున్నారు. దీనిని మనం బాధ్యతగా తీసుకోవాలి. దయచేసి సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి. వారి త్యాగాన్ని మనం గౌర‌విద్ధాం "అని సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాయి ధరమ్ తేజ్ 10 లక్షల విరాళం:

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి అండగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమకి తోచిన సహాయం చేస్తున్నారు.. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్లు, పవన్ కళ్యాణ్ రెండు కోట్లు, రామ్ చరణ్, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లు అర్జున్ కోటి 25 లక్షలు ఇచ్చారు. అందులో భాగంగానే హీరో సాయి ధరమ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

విజృంభిస్తున్న కరోనా:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు సంఖ్య అయిదు ల‌క్ష‌లు దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వైరస్ బారిన ప‌డి 22, 334 మంది మృతిచెందారు. 1, 21, 214 మంది కోలుకున్నారు. ఇక భారత్ లో కుడా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 700కి చేరుకోగా, 17 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో 60 కేసులు నమోదు కాగా, ఏపీలో 13 కరోనా కేసులు నమోదు అయ్యాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories