రానా చెప్పేశాడు : ఈమే నా ప్రేయసి..త్వరలోనే నా పెళ్లి!

రానా చెప్పేశాడు : ఈమే నా ప్రేయసి..త్వరలోనే నా పెళ్లి!
x
Rana Daggubati
Highlights

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి పెళ్లికి సిద్ధం అయ్యారు.. తాజగా దగ్గుబాటి రానా తన ప్రేయసిని ట్విట్టర్ వేదికగా అందరికి పరిచయం చేశాడు. ఆమె తన ప్రేమకి ఒకే చెప్పిందని, ఆమెకి సంబంధించిన పిక్ తో పాటు ఆమె పేరు మిహీకా బజాజ్ అంటూ రివీల్ చేశాడు రానా..

ఇక ఇప్పటికే రానా ప్రేమ వ్యవహారం పై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. అందులో వాస్తవం లేదని రానా క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ రూమర్స్ కి చెక్ పడలేదు.. ఈ నేపధ్యంలో ఎలాంటి మొహమాటం లేకుండానే రానా తన ప్రేయసిని అందరికి పరిచయం చేశాడు. దీనితో రానా కో స్టార్స్ కియారా అద్వానీ, రాశీ ఖన్నాతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.

ఇక త్వరలోనే రానా ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు.. మిహీకా బజాజ్ విషయానికొస్తే.. ఆమెది హైదరాబాద్. ప్రస్తుతం ఆమె 'డ్యూ డ్రాప్ స్లూడియో' అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇదొక ఈవెంట్ కంపెనీ. గొప్పగొప్ప వాళ్ల ఇళ్లలో ఈవెంట్లను ఈ కంపెనీ డిజైన్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రానా, మిహీకా కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తరవాత నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుం, రుద్రమదేవి లాంటి విభిన్నమైన చిత్రాలలో నటించి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో బళ్లాలదేవ పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాడు.

ప్రస్తుతం రానా అరణ్య అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటు విరాటపర్వం అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories