కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రాజశేఖర్‌ కుమార్తెల విరాళం

కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రాజశేఖర్‌ కుమార్తెల విరాళం
x
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది..ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు.

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. ఈ సంస్థ ద్వారా సినీ కార్మికుల కోసం ఎన్నోకార్యక్రమాలను నిర్వహించనున్నారు.

తాజాగా నటుడు రాజశేఖర్‌ కుమార్తెలు శివానీ, శివాత్మిక తమ వంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి తమ సొంత సంపాదన నుంచి రూ.2 లక్షలను ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. " కరోనా కష్టాలు మొదలైనప్పటి నుంచే చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారికీ నిత్యావసర వస్తువులను అందజేస్తున్నాం.. కరోనా క్రైసీస్‌ ఛారిటీకి కూడా మా వంతు సాయం చేయాలనుకున్నాం.

ఈరోజు నా కుమార్తెలు శివానీ, శివాత్మిక ఇద్దరు కూడా తమ సంపాదనల నుంచి చేరొక రూ.లక్షను విరాళంగా ప్రకటించమని అన్నారు. అలాగే మా తరఫున పేదలకు ఆహార సామగ్రిని అందిస్తున్న కార్మికులకు, పోలీస్‌ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. 'జీవితంలో ఎన్నో సందర్భాల్లో మా తల్లిదండ్రులను చూసి మేం స్ఫూర్తి పొందాం. వాళ్లలాగే మేం కూడా బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నాం. సీసీసీ కోసం రూ.లక్ష చొప్పున విరాళంగా అందిస్తున్నాం.' అని శివానీ, శివాత్మిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories