రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ 'సాహో ' హిందీ వర్షన్

రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ సాహో  హిందీ వర్షన్
x
Prabhas (File Photo)
Highlights

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వర్షం, చత్రపతి, బుజ్జిగాడు ,డార్లింగ్ ,మిస్టర్ ఫర్ఫెక్ట్...

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వర్షం, చత్రపతి, బుజ్జిగాడు ,డార్లింగ్ ,మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ స్టామినా ఎక్కడికో వెళ్ళిందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతున్నాయి. గతేడాదిలో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సాహో బాక్సాఫీస్ ని షేక్ చేసిందనే చెప్పాలి.

తాజాగా ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు విశేషమైన స్పందన లభించింది. గత నెల ఏప్రిల్ 25వ తేదీన అక్కడ ప్రచారం చేయగా మంచి వ్యూస్ ని సంపాదించుకుంది. ఈ సినిమాకు పట్టణ ప్రాంతాల్లో 5,303,000 ఇంప్రెషన్స్‌, గ్రామాల్లో 3,300,000 ఇంప్రెషన్స్‌ లభించాయి. ఇలా మొత్తం కలిపి 8.33 మిలియన్‌ ఇంప్రెషన్స్‌ను చిత్రం సొంతం చేసుకొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. దీంతో 2020లో 17వ వారంలో అత్యధిక మంది చూసిన సినిమాగా ప్రభాస్ సాహో మూవీ రికార్డు సృష్టించింది.

అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే సాహో సినిమా ని ఇప్పటికే పలుమార్లు ప్రసారం చేసినప్పటికీ ఈ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ స్టార్ల సినిమాలను సైతం పక్కన పెట్టి మరి ఓ టాలీవుడ్ హీరో సినిమా అక్కడ రికార్డు సృష్టించడం హర్షించదగ్గ విషయంగా పేర్కొనవచ్చు..

ఇక ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం కె రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ప్రభాస్... సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories