విజయ్ కి మద్దతుగా నిలవడం అభినదనీయం: నాగార్జున

విజయ్ కి మద్దతుగా నిలవడం అభినదనీయం: నాగార్జున
x
Highlights

లాక్ డౌన్ సమయంలో అవసరంలో ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం హీరో విజయ్ దేవరకొండ, దేవరకొండ ఫౌండేషన్ పేరు మీద సహాయ నిధి ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్న సంగతి...

లాక్ డౌన్ సమయంలో అవసరంలో ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం హీరో విజయ్ దేవరకొండ, దేవరకొండ ఫౌండేషన్ పేరు మీద సహాయ నిధి ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ పై కొన్ని వెబ్ సైట్లు నిరాధార ఆరోపణలను చేయడంతో వాటిని ఖండిస్తూ విజయ్ ఒక వీడియో ను విడుదల చేసారు. ఇలాంటి తప్పుడు వార్తలను, గాసిప్ వెబ్ సైట్లను నమ్మొద్దని, వాటికి దూరంగా ఉండాలని విజయ్ ఆ వీడియోలో తెలిపారు.

విజయ్ దేవరకొండ పిలుపుకు టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. చిరంజీవి, మహేశ్ బాబు, నాగబాబు, కొరటాల శివ, రవితేజ, అనిల్ రావిపూడి మొదలగు మద్దతు తేలిపారు. తాజాగా అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు.. చిరంజీవి ట్వీట్ పై నాగార్జున స్పందిస్తూ... సినీ పరిశ్రమలోని సహచరుడికి అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. మహేశ్, రవితేజ, రానా, కొరటాల శివ, క్రిష్, వంశీ పైడిపల్లి అందరూ నీకు అండగా ఉన్నారని విజయ్ దేవరకొండకు భరోసా కల్పించారని అన్నారు. అయితే కేవలం అండగా ఉంటే సరిపోదని, ఎదుర్కొనేందుకు మనకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలని నాగార్జున ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories