కరోనా క్రైసిస్ ఛారిటీ..చిరంజీవి సారధ్యం..నాగార్జున భారీ విరాళం!

కరోనా క్రైసిస్ ఛారిటీ..చిరంజీవి సారధ్యం..నాగార్జున భారీ విరాళం!
x
Nagarjuna (File Photo)
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే థియేటర్లును మూసివేశారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని నటులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. ఇందులో ముందుగా మెగాస్టార్‌ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇ‍వ్వగా.. తాజాగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున రూ. కోటి విరాళం ప్రకటించారు. అంతేకాకుండా ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య, ఎన్టీఆర్ 25లక్షల రూపాయల విరాళం ప్రకటించారు..

ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ.. "ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ అనేది చాలా అవసరం. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఈ సమయంలో పేద సినీ కార్మికుల కోసం నా వంతుగా రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నా. దేవుడు మనలను చల్లగా చూస్తాడు.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి" అంటూ నాగార్జున పేర్కొన్నారు.

ఇక కరోనా వైరస్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ పరిశ్రమలోని ప్రముఖులు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్ల విరాళం ఇవ్వగా, పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, అల్లు అర్జున్ కోటి 25 లక్షల విరాళం ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు..

ఇక రోజురోజుకీ కరోనా వైరస్ తన పంజా విసురుతుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి 20 వేల మంది మరణాలకు కారణమైంది. అయిదు లక్షల మంది ఈ వైరస్ బారినా పడ్డారు. ఇక భారతదేశంలో ఇప్పటికే 20 మంది మృతి చెందగా, 900కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories