అలాంటివారిపై చర్యలు వెంటనే తీసుకోవాలి.. విజయ్ కి మద్దతుగా నాగబాబు

అలాంటివారిపై చర్యలు వెంటనే తీసుకోవాలి.. విజయ్ కి మద్దతుగా నాగబాబు
x
Nagababu (File Photo)
Highlights

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కరోనా ప్రభావంతో అల్లడిపోతున్నా ప్రజలను ఆదుకోవడానికి తనవంతుగా సహాయం చేయడానికి ది దేవరకొండ ఫౌండేషన్, మిడిల్ క్లాస్...

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కరోనా ప్రభావంతో అల్లడిపోతున్నా ప్రజలను ఆదుకోవడానికి తనవంతుగా సహాయం చేయడానికి ది దేవరకొండ ఫౌండేషన్, మిడిల్ క్లాస్ ఫండ్ అనే ఫౌండేషన్ లను స్థాపించిన సంగతి తెలిసిందే.. విజయ్ చేస్తున్న ఈ సహాయాన్నీ చాలా మంది అభినందించారు. కానీ కొన్ని వెబ్సైట్స్ మాత్రం తప్పుడుగా ప్రచారం చేశాయి. అయితే దీనిపైన సీరియస్ అయిన విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు.

తప్పుడు వార్తలు రాసిన సదరు వెబ్సైట్స్ పై విజయ్ ఫైర్ అయ్యారు. తాను చేస్తున్న సహాయం గురించి ప్రశాంతంగా వివరించారు. అంతేకాకుండా కరోనా కట్టడికి విజయ్ దేవరకొండ విరాళం ఇవ్వడం లేదు అంటూ కొన్ని ఆర్టికల్స్ రాశారని, అసలు నన్ను అడగడానికి మీరు ఎవరు అంటూ విజయ్ ఫైర్ అయ్యారు. నాకు నచ్చినప్పుడు, నేను అనుకున్నప్పుడు,నాకు కుదిరినప్పుడు, నేను ఎలా ఇవ్వాలో, ఎవ్వరికి ఇవ్వాలో, నా మనసుకు ఎవరు కనెక్ట్ అయితే వాళ్లకు ఇస్తా. అది నా ఇష్టం. అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

అయితే విజయ్ కి మద్దతుగా సినీ తారలు నిలుస్తున్నారు. మహేష్ బాబు, చిరంజీవి, రవితేజ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, కొరటాల శివ మద్దతు తెలిపారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సైతం ట్విట్టర్ వేదికగా విజయ్ కి మద్దతు తెలిపాడు. "హాయ్‌ విజయ్.. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్‌సైట్స్ అంటూ నీవు మాట్లాడిన మాటలకు నేను మద్దతు తెలుపుతున్నా. ఇలాంటి వెబ్‌సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ రక్తాన్ని వాళ్ళు జలగల్లా పీల్చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది"అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories