సరికొత్త 'సినిమా' మొదలైంది

సరికొత్త సినిమా మొదలైంది
x
balakrishna, Nagababu(file photo)
Highlights

మరోసారి టాలీవుడ్ లో వివాదం రాజుకుంది. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్, థియేటర్లు మూతపడి స్తబ్దుగా ఉన్న ఇండ్రస్ట్రీని మళ్లీ గాడిలో...

మరోసారి టాలీవుడ్ లో వివాదం రాజుకుంది. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్, థియేటర్లు మూతపడి స్తబ్దుగా ఉన్న ఇండ్రస్ట్రీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కొందరు హీరోలు, దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో స్టార్ వార్స్ మొదలైంది. సిల్వర్ స్క్రీన్ మీద కాదు..బహిరంగంగానే మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రితో కూర్చూని భూములు పంచుకుంటున్నారనేమో అన్న బాలకృష్ణ వ్యాఖ్యలు మంటలకు ఆజ్యం పోశాయి. నోటికొచ్చినట్లు మాట్లాడరాదని నాగబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. టాలీవుడ్ లో అసలేం జరుగుతుంది.

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణం గా చిత్ర పరిశ్రమ చాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పరిశ్రమను నమ్ముకున్న కార్మికులు థియేటర్స్ మీద ఆధారపడ్డ వేలమంది రోడ్డున పడ్డారు. ఈ తరుణంలోటాలీవుడ్ పెద్దలు పరిశ్రమను గాడిలో పెట్టేందుకు, షూటింగ్స్ ని తిరిగి స్టార్ట్ చేసేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు జరిపారు. ఆ తర్వాత సీఎంతో సమావేశమయ్యారు.

ఇప్పటి వరకు నాలుగుసార్లు హీరోలు, దర్శక నిర్మాతలు సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశాలకు నందమూరి బాలకృష్ణతో పాటు మరికొందరు హీరోలను పిలువలేదు. తెలుగు ఫిలిం ఛాంబర్ ను వదిలి ప్రయివేట్ మీటింగ్స్ నిర్వహించడంపై కొందరు సినీ పెద్దలు తప్పుపడుతున్నారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చిన బాలకృష్ణ ..ప్రస్తుతం ఇండస్ట్రీ లో షూటింగ్స్ ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదని.. షూటింగ్స్ కోసం గవర్నమెంట్ తో చర్చలు జరుగుతున్నాయని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. సినీ పెద్దల సమావేశాలకు తనకు ఎవరూ పిలువలేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ ఘాట్ తర్వాత బసవతారం హాస్పటల్ లో కొంత మంది డాక్టర్స్ , మీడియా ప్రతినిధులు ఉన్నప్పుడు బాలకృష్ణ ఆఫ్ ది రికార్డులో మాట్లాడారు. సమావేశాల పేరిట కొందరు మంత్రి తలసానితో కూర్చొని భూములు పంచుకుంటున్నారు అని చెప్పారు. బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

అందరీ రిక్వెస్ట్ మేరకే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారని నిర్మాతల మండలి అధ్యక్షులు సి. కల్యాణ్ స్పష్టం చేశారు. బాలకృష్ణతో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే, ఆయన్ను తీసుకెళుతామని చెప్పారు.

బాలకృష్ణ వ్యాఖ్యల గురించి తనకేం తెలియదన్నారు మంత్రి తలసాని. మీటింగ్ లకు అందర్నీ పిలవడం సాధ్యం కాదని, ఫిలిం ఛాంబర్ లో అందరూ కలిసి మీటింగ్ పెడితే వచ్చి మాట్లాడుతానని చెప్పారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడరాదని హెచ్చరించారు. ఇండస్ట్రీ లో మీరేమి కింగ్ కాదు.. మీరు ఓ హీరో అంతే.. మీరు మాట్లాడితే మాట్లాడటానికి చాలామంది రెడీగా ఉన్నారన్నారు. ఇండస్ట్రీలో ఎవరూ రియల్ వ్యాపారం చేయడంలేదని, ఏపీకి వెళ్లే ఎవరి లెవల్ ఏమిటో తెలుస్తుందన్నారు. సమావేశాల పేరిట భూములు పంచుకుంటున్నారేమో అన్న బాలకృష‌్ణ వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఘాటుగా రియాక్ట్ అవ్వటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories