Top
logo

ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్న మంచు ఫ్యామిలీ

ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్న మంచు ఫ్యామిలీManchu Mohan babu (File Photo)
Highlights

కరోనా వైరస్ రోజురోజుకు విస్తరించడంతో ముందస్తు చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ రోజురోజుకు విస్తరించడంతో ముందస్తు చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనితో జనజీవనం ఎక్కడికక్కడే స్తభించిపోయింది. కరోనాపై పోరాటానికి తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుకు వచ్చి బాసటగా నిలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులు, నిర్మాతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్ధిక సహాయం అందించారు. అంతేకాకుండా సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసి విరాళాలను సేకరిస్తున్నారు.

అందులో భాగంగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ముందుకు వచ్చి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్ డౌన్ తొలిగించే వరకు ఇలాగే కొనసాగించనున్నారు. అంతేకాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా పంపిణి చేస్తున్నారు. దీనితో నెటిజన్లు మంచు ఫ్యామిలీని అభినందిస్తున్నారు.. ఇక మోహన్ బాబు చిత్తూరు జిల్లాలోని మొదుగులపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే.

Web TitleTollywood actor Manchu Mohan babu family has adopted 8 villages due to corona lockdown
Next Story