విజ‌య్ దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌కి లక్ష రూపాయల విరాళం అందించిన కార్తికేయ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌కి లక్ష రూపాయల విరాళం అందించిన కార్తికేయ‌
x
Kartikeya (File Photo)
Highlights

లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధి కోల్పోయారు.

లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వాళ్ళను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, ఛారిటీలు ముందుకు వచ్చి లబ్దిదారులకు బియ్యం, పప్పు వంటి నిత్యావసరాలు అందించడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి. అందులో భాగంగా యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేశారు విజయ్ . 25లక్షల రూపాయలతో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఎవరికైనా thedeverakondafoundation.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారట. ఇలా 2000 కుటుంబాల అవసరాలని ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే ఉద్ధేశంగా పెట్టుకున్నట్టు విజయ్ తెలిపాడు.

విజయ్ ఏర్పాటు చేసిన ఈ ఫౌండేష‌న్‌కి మంచి స్పందన వస్తుంది. ఎవ్వరూ పట్టించుకోని మిడిల్ క్లాస్ గురించి ఆలోచించారని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా ఈ ఫౌండేషన్ కి 'RX 100' ఫేం కార్తికేయ తొలిసారిగా లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ఈ విషయాన్నీ కార్తీకేయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''మాటల్లేవ్ విజయ్ దేవరకొండ అన్న. నీ నిర్ణయానికి వందనం. మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు.

నిరుద్యోగం మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు. నా వంతుగా MCFకు రూ.1 లక్ష అందజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళం ఇవ్వాలని విన్నవిస్తున్నాను'' అని కార్తికేయ వెల్లడించాడు. ఇక దర్శకుడు కొరటాల శివ విజయ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ.... " లవ్ యౌ బ్రదర్ .. ప‌దిమందికి తోడుగా ఉండే ప‌నుల్లో నీకు తోడుగా నేనుంటా. కుమ్మేద్దాం. మంచితో. త్వర‌లోనే క‌లుద్దాం అని ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories