Baaghi 3 Trailer: బాప్‌రే..బాప్.. సూపర్ యాక్షన్

Baaghi 3 Trailer: బాప్‌రే..బాప్.. సూపర్ యాక్షన్
x
Highlights

గతేడాది వార్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన టైగర్ ష్రాఫ్ ఈ ఏడాది మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

గతేడాది వార్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన టైగర్ ష్రాఫ్ ఈ ఏడాది మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, రితేష్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్‌ నటించిన భాగీ3 సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ రోజున ఆ సినిమా అఫిషియల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కేవలం ఫైటింగ్ సన్నివేశాల గురించి మాత్రమే. టైగర్ తన 6ప్యాక్ బాడీ, అతని హైట్ కి తగ్గట్టుగానే ఫైటింగ్ సన్నివేశాలను కంపోజ్ చేశారు ఈ సినిమాలో. ఇందులో అతను చేసే స్టంట్స్, ఫైటింగ్ ప్రేక్షకుల్ని ఎంగానో ఆకట్టుకుంటాయనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో పెట్టిన ఫైటింగ్ సన్నివేశాలన్నీ హాలీవుడ్ సినిమాని తలపిస్తాయనే చెప్పుకోవాలి. టైగర్ మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట కాబట్టే ఇలాంటి ఫైట్ సీన్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది చిత్ర యూనిట్. ఇక ఇందులో కార్లపై నుంచి ఎగురుకుంటూ వెళ్లి కొట్టే సన్నివేశం ట్రైలర్‌కే హైలైట్.

ఇక పోతే ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ పాత్ర కీలకం అనే చెప్పుకోవాలి. హీరో టైగర్ ష్రాఫ్ కి సోదరునిగా, ఒక మంచి స్నేహితుడిగా నటించాడు. ఈ సినిమాలో రితేష్‌ను కాపాడుకోవడం కోసం టైగర్ ఉగ్రమూకలను ఎలా మట్టుబెట్టాడు అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ విషయానికొస్తే ఈసారి తన పాత్ర కేవలం పాటలకు, రొమాన్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఫైటింగ్ సీన్లలో కూడా వాడుకున్నారు.

ఇక ఇదే తరహాలో బాలీవుడ్ లో 2016లో రీలీజ్ అయిన 'బాఘి' టైగర్ ష్రాఫ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ సిరీస్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తెలుగులో విజయం సాధించిన 'వర్షం' సినమాకి రీమేక్‌గా తెరకెక్కించారు. ఇదే తరహాలో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ నటించిన 'బాఘి 2'ను 2018లో రీలీస్ చేసారు. ఈ సినిమా కూడా దాదాపుగా తెలుగు సినిమాని రీమేక్ చేసిందే. ఇప్పుడు మూడో సీక్వెల్ గా రాబోతున్న భాగీ3 మాత్రం సొంత స్క్రిప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రెండు సినిమాల్లాగే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బొమ్మ దద్దరిల్లేలా చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories