Top
logo

'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి
Highlights

దిశ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ...

దిశ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రజల నుంచి ఇటు సినీ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.


దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన 'దిశ' ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న 'దిశ' తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు" అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

Web TitleThis is a true homage to Disha: Megastar Chiranjeevi
Next Story


లైవ్ టీవి