2019లో ఒక్క సినిమాని కూడా విడుదల చేయని హీరోలు వీరే

2019లో  ఒక్క సినిమాని కూడా విడుదల చేయని హీరోలు వీరే
x
Allu arjun ( File Photo)
Highlights

టాలీవుడ్ నుంచి 2019 లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా మరికొన్ని సాధారణ

టాలీవుడ్ నుంచి 2019 లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా మరికొన్ని సాధారణ విజయాలను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలని అసలు ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇవన్ని ఇలా ఉంటే అసలు 2019లో ఒక్క సినిమా కూడా చేయని హీరోలు కూడా ఉన్నారు. వారెవరో ఓ లుకేద్దాం

1. ఎన్టీఆర్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో సినిమా చేసింది లేదు. ఈ సినిమాని 2018లో దసరా సందర్భంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని 2020 జులై 30 న రిలీజ్ చేయనున్నారు.

2 . పవన్ కళ్యాణ్

2018 సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాని చేశాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి 25 వ చిత్రం.. ఆ సినిమా తర్వాత పవన్ పూర్తిస్థాయి రాజకీయలపైన ఫోకస్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పింక్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాని 2020 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

3. రవితేజ

ప్లాపులతో సతమతం అవుతున్నాడు మాస్ రాజా రవితేజ. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకి సరైనా హిట్టు పడలేదు. చివరగా శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ అంథోని సినిమాని చేశారు రవితేజ.. ఈ సినిమాని 2018లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. 2020 జనవరిలో రిలీజ్ చేయనున్నారు.

4. అల్లు అర్జున్

నా పేరు శివ నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుఠపురములో అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

5. నితిన్

శ్రీనివాస కళ్యాణం లాంటి భారీ ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు నితిన్.. ఈ సినిమాని 2018 ఆగస్టులో రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మా , రంగ్ దే చిత్రాలతో వస్తున్నాడు. ఈ సినిమాలని 2020 లోనే విడుదల చేయనున్నారు.

6. అల్లరి నరేష్

ఏడాదికి అరడజన్ సినిమాలను విడుదల చేసే అల్లరి నరేష్ . ఈ సంవత్సరం మాత్రం సోలోగా ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేకపోయాడు. హీరో సునీల్ తో కలిసి చివరగా సిల్లీ ఫెలోస్ అనే సినిమాలో నటించాడు. ఇక ఈ సంవత్సరం మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించాడు ఈ అల్లరోడు. ప్రస్తుతం సోలో గా ఓ సినిమాని చేస్తున్నాడు.

7. రానా

ఈ సంవత్సరం రానా హీరోగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబునాయుడు పాత్రలో కనిపించాడు రానా .. ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.

8. సునీల్

కమెడియన్ నుంచి హీరోగా ఎదిగాడు సునీల్. హీరోగా ఫ్లాపులు ఎక్కువగా రావడంతో మళ్ళీ కమెడియన్ గానే కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరం సునీల్ హీరోగా ఒక్క సినిమా కూడా చేయకపోయిన కమెడియన్ గా చిత్రలహరి సినిమాలో కనిపించాడు. చివరగా సునీల్ హీరోగా సిల్లీ ఫెలోస్ అనే సినిమాలో నటించాడు. ఇందులో మరో హీరోగా అల్లరి నరేష్ నటించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories