2019 లో తెలుగులో తెరకెక్కిన బయోపిక్ లు ఇవే

2019 లో తెలుగులో తెరకెక్కిన బయోపిక్ లు ఇవే
x
Telugu Biopics( File Photo)
Highlights

వెండితెరపైన ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ రాజకీయ నేతల జీవిత చరిత్రలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

వెండితెరపైన ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ రాజకీయ నేతల జీవిత చరిత్రలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే 2019లో కొన్ని బయోపిక్ లు వెండితెర పైన సందడి చేశాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం..

1. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు

బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న వేళ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపైకి తీసుకువచ్చారు. నందమూరి బాలకృష్ణ. అయన బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడుగా రెండు పార్టులుగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలయ్యే నటించి,మెప్పించి ప్రశంసలు అందుకున్నారు.

2. యాత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలక ఘట్టం అయిన పాదయాత్రలో భాగంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాకి మంచి ఆదరణ లభించింది.

3. లక్ష్మీస్ NTR

నందమూరి తారకరామారావు రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 'లక్ష్మీస్ NTR' చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

4. జెర్సీ

వరుస సక్సెస్ లతో ముందుకు వెళ్తున్న హీరో నాని ఓ క్రికెటర్ గా నటించిన చిత్రం 'జెర్సీ' ..ప్రముఖ క్రికెటర్ రమణ్ లాంబ జీవితానికి దగ్గరగా ఈ సినిమా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. సినిమాకి పెద్దగా కలెక్షన్లు రాకపోయినా ప్రేక్షకులను మెప్పించింది.

5.మల్లేశం

ప్రముఖ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. తన తల్లి కోసం ఆసుయంత్రాన్ని చింతకింది మల్లేశం పడ్డ శ్రమ ఏంటి అన్నది మెయిన్ థీమ్ .. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.

6 . సైరా

చరిత్ర మరిచిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది, ఈ సినిమాలో ఉయ్యాలవాడగా చిరంజీవి నటించారు. ఫ్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి ఆదరణే లభించింది.

7.జార్జిరెడ్డి

ఉస్మానియా విద్యార్థి నాయ‌కుడిగా ఎన్నో విద్యార్థి ఉద్యమాల‌కు ఊపిరి పోసిన నాయకుడు జార్జిరెడ్డి. అతడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సందీప్ మాధవ్ హీరోగా నటించగా, జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. విడుదలకి ముందు ఎన్నో వివాదాలు క్రియేట్ చేసిన విడుదల తర్వాత మిశ్రమ ఫలితాన్ని అందుకుంది ఈ సినిమా.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories