చిరంజీవి 152 సినిమా పైన అన్ని ఊహాగానాలే? క్లారిటీ వచ్చేది ఎప్పుడు ?

chiranjeevi,koratala siva
x
chiranjeevi,koratala siva
Highlights

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించి...

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించి మెప్పించారు. అయన కెరియర్ లోనే అత్యధికమైన వసూళ్ళను సాధించిన సినిమాగా సైరా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత వెంటనే కొరటాల శివ తో సినిమాని మొదలు పెట్టారు చిరంజీవి . విజయదశమి సందర్బంగా సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఈ సినిమాని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ తో కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాపైన సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అవేంటో చూద్దాం.

1. ఈ సినిమా దేవాదాయ ధర్మదాయ శాఖలో జరిగే అక్రమాల చూట్టు సాగుతుందని ఓ ప్రచారం జరుగుతుంది.

2. ఈ సినిమాలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా రామ్ చరణ్ యంగ్ చిరంజీవిగా కనిపించనున్నాడనేది మరో టాక్

3. ఈ సినిమాకి గోవిందా ఆచార్య, లేదా గోవిందా హరి గోవిందా అనే టైటిల్ ని పెట్టినట్టు ప్రచారం నడుస్తుంది.

4. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష ఫిక్స్ అని వార్తలు వచ్చాయి.

5.ఇక ఓ ప్రధాన పాత్రలో కనిపించేందుకు కొరటాల శివ ఈశా రెబ్బాను ఫైనల్ చేసారని, మరో పాత్రలో జెనిలియా నటిస్తుందని ప్రచారం సాగింది.

6. ఇక ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కాదని సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడని మరో టాక్ నడుస్తుంది.

ఇలా రోజుకొక్క వార్త వినిపిస్తూనే ఉంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం దేనిపైన స్పందించింది లేదు. మరి ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో చూడాలి. డిసెంబర్ లో సినిమా పట్టాలేక్కనుంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories