నేను సింబా.. ముసాఫా కొడుకుని! అంటున్న నానీ

నేను సింబా.. ముసాఫా కొడుకుని! అంటున్న నానీ
x
Highlights

ఇప్పుడు ప్రపంచమంతా ఓ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఎపుడెపుడు ఆ సినిమా వస్తుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే.. డిస్నీ యానిమేషన్ పిలిం 'ది లయన్...

ఇప్పుడు ప్రపంచమంతా ఓ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఎపుడెపుడు ఆ సినిమా వస్తుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే.. డిస్నీ యానిమేషన్ పిలిం 'ది లయన్ కింగ్'. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే.. విడుదలవుతున్న ప్రతీ భాషలోనూ యానిమేటెడ్ జంతువుల పాత్రలకి ఆయా భాషల్లో పేరున్న నటీనటులతో డబ్బింగ్ చెప్పించారు. తెలుగులోనూ అదే విధంగా చేశారు.

ఈ సినిమాలోని ముఖ్యపాత్ర సింబా.. నేను సింబా.. ముసాఫా కొడుకుని! అంటూ ఆ పాత్రకి నానీ డబ్బింగ్ చెప్పారు. నానీ డబ్బింగ్ చెప్పిన మాటలతో.. టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు నానీ. ఇపుడు అది వైరల్ గా మారింది. "మా నాన్న ఒకసారి చెప్పారు .. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని" అంటూ నాని డబ్బింగ్ చెప్పిన డైలాగ్ తో పాటు వస్తున్నా సీన్లు ఆకట్టుకునే లా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories