Top
logo

మీరు మా పాటను మరింత సెన్సేషనల్ చేశారు : తమన్

మీరు మా పాటను మరింత సెన్సేషనల్ చేశారు : తమన్
X
Highlights

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టు...

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టు అయ్యయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. శ్రోతలను వీపరితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సామజవరగమన' పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందులో భాగంగానే ఈ పాట' తెలంగాణా మంత్రి కేటీఆర్ ని కూడా బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న కేటీఆర్ అక్కడ మంచు కురుస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ సామజవరగమన పాటపై స్పందించారు. ప్రస్తుతం తెల్లవారుజామున 3.30 గంటలు అవుతుంది. ఇప్పుడు సామజవరగమన పాట నాకు కంపెనీ ఇస్తుందన్నారు కేటీఆర్. నా మైండ్ నుంచి ఈ పాట అసలు వెళ్లడం లేదంటూ, వాట్ ఏ బ్రిలియంట్ సాగ్ అంటూ తమన్ ని పొగడ్తలతో ముంచెత్తారు కేటీఅర్.

అయితే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై తమన్ స్పందిచాడు. "మీరు మా పాటను మరింత సెన్సేషనల్ చేశారు" అంటూ రీట్వీట్ చేశాడు. ఇక తమ హీరో సినిమాలోని పాటపై మంత్రి కేటీఆర్ స్పందించడంతో బన్ని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక 'సామజవరగమన' పాటని ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, సిద్ శ్రీరామ్ అలపించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. జూలయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ గా నిలిచింది. ఈ సినిమాలో టబు, మురళీశర్మ, సుశాంత్, సునీల్, నివేతా పెతురాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒవర్సిస్ లో కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Web TitleThaman responded about KTR tweet for Samajavaragamana Song
Next Story