Top
logo

పవన్ సినిమాపైన తమన్ క్లారిటీ

పవన్ సినిమాపైన తమన్ క్లారిటీ
X
Highlights

2018 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 25 వ సినిమాగా అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూ

2018 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 25 వ సినిమాగా అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలకి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రాన్నున్నారని, అయన రీఎంట్రీగా బాలీవుడ్ లో మంచి హిట్టు అయిన పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమాపైన ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించింది లేదు.

అయితే తాజగా ఈ సినిమాపైన సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి గాను తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని ఒక్కోపాట సూప‌ర్ హిట్ అయిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్రత్యేక ఫ్లవ‌ర్ బొకేను పంపారు. ఈ సందర్భంగా పవన్ తమన్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదే విషయాన్నీ తమన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. "నేను ఎంత‌గానో ఆరాధించే వ్యక్తి నుండి గిఫ్ట్ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇది మ‌న నాయ‌కుడు ఫ్యూచ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి నుండి వ‌చ్చింది. ఆయ‌న‌కి నా ధ‌న్యవాదాలు. ప్రస్తుతం ప‌వన్ సినిమాల‌కి పాట‌లు కంపోజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్" అని పేర్కొన్నాడు థ‌మ‌న్.

ఈ సినిమాని జనవరి 20న సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని, ఫిబ్రవ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హేగ్దేని ఫిక్స్ చేశారట.. ఇక ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయని వినికిడి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

Web Titlethaman clarity about pawan kalyan movie
Next Story