కరోనాపై పోరు: హీరో విజయ్‌ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు కూడా..

కరోనాపై పోరు: హీరో విజయ్‌ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు కూడా..
x
Highlights

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే, ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా...

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే, ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధులకి భారీగా విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కూడా కరోనా నియంత్రణ చర్యలకు భారీ విరాళం ప్రకటించారు. మొత్తం రూ. 1.3 కోట్ల విరాళం అందజేయనున్నట్టు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, పుదిచ్చేరి రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, స్వరాష్ట్రం తమిళనాడుకు రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి రూ.25 లక్షలు, దక్షిణ భారత నటుల సంఘానికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అంతే కాకుండా విజయ్‌ తన అభిమాన సంఘాల ద్వారా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోన్న వారికి నేరుగా సాయం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories