ఆ సినిమాపైన అన్ని ఆశలు పెట్టుకున్న ఈషా

eesha rebba
x
eesha rebba
Highlights

తెలుగు అమ్మాయిలు వెండితెరపై స్టార్ట్ హీరోయిన్ గా కొనసాగడం అనేది చూసి చాలా రోజులు అవుతుంది.

తెలుగు హీరోయిన్స్ వెండితెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగడం అనేది చూసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ లందరూ పక్క రాష్ట్రం నుండి వచ్చినవారే. తెలుగు అమ్మాయిలు అరకొర సినిమాల్లో నటిస్తున్నప్పటికీ వారికి రావల్సినంతగా గుర్తింపు అయితే రావడం లేదు. ఇందులో ఈషా రెబ్బా ఒకరు.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తరువాత సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది ఈషా. మొదటి సినిమాలోనే మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అమి తుమి, బందిపోటు సినిమాల్లో నటించింది. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

సినిమాలో అయితే అవకాశం వచ్చింది కానీ పూర్తి స్థాయి కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు గుర్తింపు రాలేదు. చాలా ఫోటో షూట్ లతో నిత్యం సోషల్ మీడియాలో ఉంటుంది ఈషా. తాజాగా ఆమె రాగాల 24 గంటల్లో అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలు పెంచేసింది. సినిమా మొత్తం ఈషా చుట్టూనే తిరగబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాపైన ఆశలు పెట్టుకుందట ఈ భామ. ఈ సినిమా ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే ఈషాకి మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకేక్కబోయే సినిమాలో అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories