Top
logo

ఆ ఎమ్మెల్యేకి సవాల్ విసిరిన రాహుల్...

rahul sipligunjrahul sipligunj
Highlights

పాటలు పాడే రాహుల్ పార పట్టాడు. అంతే కాదు ఎమ్మెల్యే కే ఛాలెంజి విసిరాడు. ఇదంతా గ్రీన్ ఛాలెంజిలో భాగంగా బిగ్ బాస్ విజేత హంగామా!

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సవాల్ విసిరాడు. మీరు అనుకుంటున్నట్టు ఇది రాజకీయ సవాల్ మాత్రం కాదు లెండి..! గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా నటుడు, దర్శకుడు విశ్వేక్ సేన్ , తరుణ్ భాస్కర్ తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కి కూడా నామినేట్ చేసాడు రాహుల్..

ప్రముఖ యాంకర్ సుమ కనకాల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ ని స్వీకరించిన రాహుల్ తన వంతుగా మొక్కని నాటాడు. ఆ తర్వాత మరో ముగ్గురిని నామినేట్ చేసాడు. ఈ సందర్భంగా రాహుల్ తనని ప్రకృతిని పరిచయం చేసిన సుమకి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ కు ధన్యవాదాలు తెలిపాడు రాహుల్.. తాను మొక్కని నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాహుల్. అంతే కాకుండా మొక్కలు పెంచడం అనేది తనకు తెలీని పని అని, ఆ పనిని తనకు ఛాలెంజ్ గా ఇచ్చి దానిలోని గొప్పతనాన్ని తెలియచేసిన సుమక్క కి ధన్యవాదాలు అని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇక బిగ్ బాస్ 3 కి విజేతగా నిలిచిన అనంతరం రాహుల్ మళ్లీ తన సినిమా పాటలతో బిజీ అయిపోయాడు. తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న 90 ml సినిమాలో సింగిల్ సింగిల్ అంటూ రాహుల్ ఓ పాట పాడాడు. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి చాలా రోజులు కావస్తున్నా, పలు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు రాహుల్..



Web TitleTelugu Biggboss 3 winner Rahul sipligunj send green challenge request to TRS MLA
Next Story

లైవ్ టీవి


Share it