రూటు మార్చిన మెగా హీరో

రూటు మార్చిన మెగా హీరో
x
Highlights

కథ.. కంటెంట్ నమ్ముకున్న వారికే ప్రస్తుతం విజయాలు. ఎప్పటిలా మూడు ఫైటులు.. ఆరు పాటలు అంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా తప్పట్లేదు. హీరో పెద్దా.. చిన్నా...

కథ.. కంటెంట్ నమ్ముకున్న వారికే ప్రస్తుతం విజయాలు. ఎప్పటిలా మూడు ఫైటులు.. ఆరు పాటలు అంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా తప్పట్లేదు. హీరో పెద్దా.. చిన్నా ఇటువంటివి ప్రేక్షకులకు పట్టటం లేదు. హీరో లేకుండా.. హీరోయిన్ ఒక్కరే ఉన్నా సరే.. కంటెంట్ లో దమ్ముంటే చాలు సినిమాకి కాసుల వర్షం కురిపించేస్తున్నారు. అందుకే.. ఇప్పటి యువ హీరోలకు ప్రతి సినిమా పరీక్షలా మారిపోతోంది. కంటెంట్ మంచిదైతే.. సినిమా అటూ ఇటూ అయినా హీరోకి పేరు వస్తుంది. కనీసం మంచి సినిమా చేశామన్న తృప్తి మిగులుతుంది. ఇప్పడు హీరోలంతా కంటెంట్ వెతుక్కుంటున్నారు.

ఇపుడు అదే పద్ధతిలో మెగా ఫ్యామిలీ హీరో సాయి తేజ్ కూడా అలాంటి బాటే పట్టాడు. వరిసగా ఫ్లాప్ లతో కళ్ళు తెరుచుకున్న తేజూ.. చిత్రలహరి సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు. సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడం.. తేజూ కి నటించే అవకాశం దొరకటం.. దానితో పేరు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఈ సినిమాతో. అందుకే ఇపుడు బలమైన కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నడీ కుర్రహీరో.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తేజు 'ప్రతి రోజు పండగే' అనే సినిమాలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజు పక్కింటబ్బాయి టైపు క్యారక్టర్ లో నటిస్తునన్నాడట. ఇదిలా ఉంటే దేవా కట్టా దర్శకత్వంలో తేజు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

తేజు వరసగా మాస్ మాసాలా సినిమాలను.. కమర్షియల్ ఎంటర్టైనర్లను ఎంచుకునేవాడు. కానీ ఇపుడు ఈ లైనప్ చూస్తుంటే మాత్రం పూర్తిగా రూట్ మార్చినట్టుగా అనిపిస్తోంది. మరి ఈ రూట్ లో సక్సెస్ అవుతాడా అనేది వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories