logo
సినిమా

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మొదలైన వ్యతిరేకత

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మొదలైన వ్యతిరేకత
X
Highlights

రాంగోపాల్ వర్మ తీస్తూన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వ్యతిరేకత మెుదలైంది.

రాంగోపాల్ వర్మ తీస్తూన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వ్యతిరేకత మెుదలైంది. ఈ చిత్రం టీజర్ లో ఏపీ సీఎం చంద్రబాబు ఆహభావాలను చిత్రాలను వివాదస్పదంగా చూపించారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వర్మ ఈ సారి తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబుపై పడ్డారని ఎద్దేవా చేశారు. దర్శకుడు వర్మపై కర్నూలు రెండో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. న్యాయనిపుణుల సలహాతో కేసు నమోదు చేస్తామని చెప్పారు కర్నూలు సీఐ.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మొదలైన వ్యతిరేకత

Next Story