గేమ్ ఓవర్ అంటున్న తాప్సి

గేమ్ ఓవర్ అంటున్న తాప్సి
x
Highlights

హాట్ బ్యూటీ తాప్సి జోరుమీదుంది. బద్లా సినిమా సూపర్ హిట్ కావడంతో తాప్సి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇపుడు తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో...

హాట్ బ్యూటీ తాప్సి జోరుమీదుంది. బద్లా సినిమా సూపర్ హిట్ కావడంతో తాప్సి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇపుడు తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా తనకు మంచి పేరును తెస్తుండనై నమ్మకంతో ఉంది తాప్సి.

గేమ్ ఓవర్ పేరుతొ అశ్విని శరవణన్ తెరక్కిస్తున్న ఈ సినిమా హిందీ లోనూ డబ్ చేయబోతున్నారు. ఇటీవలే సినిమా టీజర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాల టీజర్ లో తాప్సి వీల్ చైర్ లో కూర్చుని కనిపించింది. బాగా భయపడుతున్నట్టుగా ఉన్న తాప్సి .. చీకటిగా ఉన్న బ్యాక్ గ్రౌండ్.. దానికి తగ్గట్టుగా వినిపించిన నేపధ్య సంగీతం సినిమా థ్రిల్లింగ్ గా ఉండబోతోందన్న సూచనలు ఇచ్చింది. మరోసారి తాప్సి మేజిక్ చేయబోతున్నాట్టు కనిపించింది. ఈ సినిమా పై టీజర్ తో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

యన్ నాట్ స్టూడియోస్ తో కల్సి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4 వ తేదీన విడుదలకానుంది. వినోదినీ వైద్యనాధన్, నీష్ కురువులా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories