తమిళ నటి పద్మజ ఆత్మహత్య

తమిళ నటి పద్మజ ఆత్మహత్య
x
TV Actress Padmaja
Highlights

తమిళ నటి పద్మజ చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె హత్య తన భర్తకి ఆమెకి మధ్య ఉన్న గొడవలే కారణమని తెలుస్తోంది. పద్మజ తిరువత్తియూర్‌లోని

తమిళ నటి పద్మజ చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె హత్య తన భర్తకి ఆమెకి మధ్య ఉన్న గొడవలే కారణమని తెలుస్తోంది. పద్మజ తిరువత్తియూర్‌లోని కలాడిపేటలో నివాసం ఉంటుంది తమిళ్ లోని పలు సినిమాల్లో, సీరియల్ లలో, పలు వాణిజ్య ప్రకటనలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక కొంతకాలం క్రిందట ఆమెకి పవన్ రాజ్ అనే వ్యక్తీతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ళ బాబు కూడా ఉన్నాడు. ఇద్దరి మధ్య గొడవలు తరుచుగా వస్తుండడంతో తమ బాబుని సమీపంలోని బంధువుల వద్ద పెంచుతూ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. తాజాగా అవకాశాలు తగ్గుముఖం పట్టడం, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం వలన ఆమె ఆత్మహత్యకి పాల్పడినట్టు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం పద్మజ ఆదివారం తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని చనిపోయింది. రెండు రోజులగా ఆమె ఫ్లాట్ లాక్ చేసి ఉండటం, లైట్స్ వెలుగుతూ ఉండడంతో ఆ ఇంటి యజమాని ఎస్ కాసినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటి తాళాన్ని పగలగొట్టి చూడగా, అందులో పద్మజ చనిపోయినట్లుగా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును తిరువొట్టియూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పద్మజ చనిపోయే ముందు ఆమె సోదరికి వీడియో కాల్ చేసి తన సమస్యలు గురించి చెప్పుకున్నారు. ఇక పద్మజ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories