మిల్కీ బ్యూటికి బర్త్ డే విషెస్

మిల్కీ బ్యూటికి బర్త్ డే విషెస్
x
Highlights

హీరోయిన్ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. ఆమెను ముద్దుగా మిల్కీ బ్యూటి అని పిలుస్తూ ఉంటారు.

హీరోయిన్ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. ఆమెను ముద్దుగా మిల్కీ బ్యూటి అని పిలుస్తూ ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.. తమన్నా 1995 డిసెంబరు 21న ముంబైలో జన్మించింది. తమన్నాది సింధీ కుటుంబం. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా. తన అన్నయ్య ఆనంద్ భాటియా మెడిసిన్ చదివాడు. చిన్నప్పట్నుంచి హీరోయిన్‌ కావాలనే తమన్నాకి ఉండేది.

ఆమె ఫ్యాషన్ ని గుర్తించిన ఆమె తల్లితండ్రులు ఆమెను ప్రోత్సహించారు. దానితో 13వ ఏటే సినీరంగ ప్రవేశం చేసింది తమన్నా. తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. మూడు సినిమాలు అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఇక 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తమన్నాకి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక అదే సంవత్సరం బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ , కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా లాంటి చిత్రాలు హిట్టు అయ్యాయి. దీనితో టాప్ హీరోయిన్ లలో తమన్నా ఒకరిగా తమన్నా ఎదిగింది. తెలుగులో టాప్ హీరోయిన్ గానే కొనసాగుతున్నా సమయంలో హిందీలోకి అడుగుపెట్టింది తమన్నా అక్కడ హిమ్మత్‍వాలా అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ తమన్నాకి అవకాశాలు మాత్రం వచ్చాయి.

తమన్నా హీరోయిన్ గా మాత్రమే కాదు ఐటెం సాంగ్స్ లో కూడా నటించి మెప్పించింది. అందులో భాగంగానే అల్లుడు శీను, జై లవ కుశ,స్పీడున్నోడు సినిమాలు వచ్చాయి. తమన్నా మంచి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా అని చెప్పేందుకు ఈ పాటలు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తాజాగా సైరా సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటి.. ఈ సినిమాలో సైరా నరసింహరెడ్డి ప్రియురాలుగా నటించి మెప్పించింది. ఆమె పాత్రకు గాను విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హీరో గోపీచంద్ , సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది తమన్నా..ఈ రోజు తమన్నా తన 31 వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. తమన్నాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ మంచి సినిమాలు చేసి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటుంది హెచ్ఎంటీవీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories