బిగ్ బాస్ కంటిస్టంట్ రవిపై స్పందించిన తమన్నా సింహాద్రి...

బిగ్ బాస్ కంటిస్టంట్ రవిపై స్పందించిన తమన్నా సింహాద్రి...
x
Highlights

అతనికి చీరలు అంటే ఇష్టమని నన్ను కట్టుకొమ్మని అడిగేవాడని కానీ నాకు మాడ్రన్ డ్రెస్ లు ఇష్టం ఉండడం వల్ల చీర కట్టుకోలేదని ఆమె పేర్కొంది .

బిగ్ బాస్ థర్డ్ సీజన్ కొంచం వేడేక్కిందంటే దానికి అంతో ఇంతో కారణం తమన్నా సింహాద్రిననే చెప్పాలి .. హేమ ఎలిమినేషన్ తో షోలోకి అడుగుపెట్టిన తమన్నా సింహాద్రి తన అటతో కాకుండా తన మాటలతో , చేతలతో షో ని నెట్టుకొచ్చింది . అయితే గతవారం ఎలిమినేట్ అయి షో నుండి బయటకు వచ్చింది . అయితే షో అనంతరం ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది . ముఖ్యంగా బిగ్ బాస్ లో రవి గురించి మాట్లాడుతూ రవి అంటే నాకు చాలా ఇష్టమని పేర్కొంది .

అతనికి చీరలు అంటే ఇష్టమని నన్ను కట్టుకొమ్మని అడిగేవాడని కానీ నాకు మాడ్రన్ డ్రెస్ లు ఇష్టం ఉండడం వల్ల చీర కట్టుకోలేదని ఆమె పేర్కొంది . ఇక షో నుండి ఎలిమినేట్ అవుతానేమో అని అనుమానం వచ్చి రవి కోసం ప్లెయిన్ శారీ కట్టుకున్నానని అతనికి కూడా అది నచ్చిందని తమన్నా పేర్కొంది .. మాడ్రన్ డ్రెస్ కంటే చీరలోనే బాగుందని శారీలు కట్టుకోమని అషు రెడ్డికి చెప్పడాని తమన్నా పేర్కొంది . మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన అనంతరం నాతో మాట్లాడడానికి రవి చాలా ప్రయత్నాలు చేసాడని , ప్రేమలో అలకలు ఉంటాయి కాబట్టి తన మీదా కోపంతోనే నేను మాట్లాడలేదని నా భాద తనకి తెలియాలనే అలా చేసానని తమన్నా వాఖ్యానించారు . తనకి ఇష్టం లేకుండానే నాతో మాట్లాడాలి అని రవి అడిగాడా ? అని తమన్నా ప్రశ్నించింది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories